Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (10:59 IST)
హైదరాబాద్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. తప్పతాగి కారుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తి అతివేగంగా కారు నడిపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్‌ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. లంగర్ హౌస్‌కు చెందిన మోనా ఠాకూర్ (35) మొదటి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం బంజారాహిల్‌కు చెందిన దినేశ్ గిరి (38)ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరూ లంగర్‌హౌస్‌ గొల్లబస్తీలో నివాసముంటూ ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. 
 
మూడు రోజుల క్రితం విహార యాత్రకు గోవా వెళ్ళిన దంపతులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. పిల్లలు బిర్యానీ కావాలని కోరిన మీదట రాత్రి 12 గంటల సమయంలో దంపతులు ద్విచక్రవాహనంపై లంగర్ హౌస్‍‌ నుంచి నానల్ నగర్‌ వైపు వెళ్ళారు. 
 
లంగర్ హౌస్ నుంచి నానల్‌ నగర్ వైపు వెళ్తుండగా ఇంద్రారెడ్డి వంతెనపై నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత మరో రెండు బైక్లను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కన నిలిపివున్న ఆటో ట్రాలీని ఢీకొట్టి ఆగింది. 
 
కారు బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడిన మోనా అక్కడికక్కడే మృతి చెందగా, దినేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చంచల్‌గూడకు చెందిన మహ్మద్ అబ్బాస్, జీడిమెట్ల సూరారం ప్రాంతానికి చెందిన షేక్ అక్తర్, జూపార్క్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావీద్ తీవ్రంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments