Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు మావోయిస్టుల వార్నింగ్.. ఎందుకు?

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (11:25 IST)
ఒకపుడు మావోయిస్టులకు కీలక స్థావంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. ఇపుడు వారి ఉనికి ఏమాత్రం కనిపించడం లేదు. అయితే, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల మళ్లీ మావోయిస్టులు తెరపైకి వచ్చారు. రేవంత్ సర్కారును హెచ్చరిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పనిచేస్తోందని మావోయిస్టు పార్టీ ఘాటుగా విమర్శించింది.
 
మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలను, ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన కూడా ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. లగచర్లలో ఫార్మాసిటీని నిర్మించి, ప్రకృతి వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన్మరణ పోరాటంలో భాగంగా మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని వెల్లడించారు.
 
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, బాధ్యతారాహిత్య వల్లనో జరుగుతున్నది కాదని... ఉద్దేశపూర్వకంగా, కార్పొరేట్ల లాభాల కోసం జరుగుతున్న ప్రయత్నమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ల నమ్మినబంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. కార్పొరేట్ల పెట్టుబడులలో వాటా, భారీ మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి డిస్ట్రీబ్యూషన్ ద్వారా ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు చిత్రం

Devarakonda: కవాయ్ ఐల్యాండ్స్ వెకేషన్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఇసైఙ్ఞాని ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments