Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

సెల్వి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (18:30 IST)
మేడ్చల్‌‌లో పట్టపగలే నడి రోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. అన్నయ్యను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా శ్రీ మాచారెడ్డికి చెందిన గుగులోతు గన్యా మేడ్చల్‌ ఆర్టీసీ డిపో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గన్యాకు ఉమేశ్‌ (24), రాకేశ్‌ (22), హరిణి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు ఉమేశ్‌కు వివాహం జరిపించగా భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో వేరే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. 
 
ఉమేశ్‌ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిత్యం వేధించసాగాడు. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, భార్యపై కూడా దాడికి దిగాడు. ఆదివారం కూడా ఇదే తరహాలో గొడవలు జరిగాయి. దీంతో ఉమేష్ సోదరులు ఆగ్రహానికి గురైయ్యారు. రాజేశ్‌, లక్ష్మణ్‌ అనే ఇద్దరు సోదరులు ఉమేష్‌పై దాడి చేసేందుకు అతనిని పట్టుకునేందుకు వెంబడించారు. వారికి చిక్కకుండా ఉమేశ్ పరుగులు తీసినా.. బస్‌ డిపో ఎదుట పట్టుకుని ఉమేశ్‌ను కత్తులతో పొడిచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మేడ్చల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments