Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. భార్య-బిడ్డను హత్యచేసి.. రైలు ముందు నిల్చుని ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (10:04 IST)
భార్యపై అనుమానంతో సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన నివాసంలో తన భార్యను, 10 నెలల కుమార్తెను హత్య చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. గణేష్ తన భార్య స్వప్న, కుమార్తె నక్షత్రాలను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కుటుంబం సికింద్రాబాద్‌లో నివాసం వుంటుంది. నిందితుడు ఆటో డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు బోవెన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments