Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (15:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న సంఘటనలు అపుడపుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుని బాలికను ప్రాణాలతో రక్షించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు మంత్రగాళ్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త! 
పొరుగింట్లో ఉన్న ఓ వివాహితకు ఓ స్నేహితుడు వాట్సాప్ ద్వారా ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీయడంతో పాటు ఇద్దరి హత్యకు కారణమైంది. కేరళ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకున్న హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని పథనంపట్టి జిల్లా కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవి (28)తో కలిసి ఉంటుంన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటి పక్కనే విష్ణు (30) అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి వాట్సాప్ నంబరుకు విష్ణు ఒకసారి ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది చూసిన బైజు తన భార్యతో గొడవకు దిగాడు. భర్తకు భయపడిన వైష్ణవి... పక్కనే ఉన్న తన స్నేహితుడు విష్ణు ఇంటిలోకి పారిపోయింది. ఇది బైజుకు మరింత ఆగ్రహం తెప్పించింది. 
 
కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు... భార్యను పెరట్లోకి లాక్కెళ్ళి నరికాడు. దీన్ని ఆపేందుకు ప్రయత్నించి విష్ణుపై  కూడా దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బైజును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments