Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

సెల్వి
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (13:32 IST)
Kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా ఆమె పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇకపోతే.. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా చేశాయి. పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆమె సోదరుడు కేటీఆర్‌ను హెచ్చరించారు.
 
ఈ మేరకు విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని హరీష్ రావు విభజించారని ఆరోపించారు. "హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, కుట్రదారుడు" అని కవిత ఆరోపించారు. "పార్టీ నుండి నా సస్పెన్షన్ నన్ను బాధించింది. కానీ అది ప్రజలకు మద్దతుగా పోరాడకుండా నన్ను ఆపలేదు, ఎటువంటి వివరణ తీసుకోకుండా నన్ను పార్టీ నుండి బయటకు పంపడానికి కుట్ర జరిగింది" అని కవిత చెప్పుకొచ్చారు. 
 
బీఆర్‌ఎస్ నేత జె. సంతోష్ రావు, అతని సహాయకులు తనపై కుట్ర పన్నారని కవిత విమర్శించారు. ఆమె భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగినప్పుడు, "నేను దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాలమే నిర్ణయిస్తుంది" అని కవిత అన్నారు. బీఆర్ఎస్‌కు హరీష్ రావు, సంతోష్ రావులు మరింత నష్టం కలిగిస్తున్నారని కవిత ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

తర్వాతి కథనం
Show comments