తెలంగాణలో ఇంటర్ ఫలితాలు - ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య!!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆరుగురు విద్యార్థులు, ఫెయిల్ అవుతామన్న భయంతో మరొకరు చనిపోయారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ విషాదకర ఘటనలు సంభవించాయి.
 
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ (18), సస్పూర్ పరిధిలోని దొరగారిపల్లెకు చెందినద గటిక తేజస్విని (18), ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి (17), మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‍కు చెందిన హరిణి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షను రాసారు. ఈ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో పైన పేర్కొన్న ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఘటనలో మహబూబా బాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని (17) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
కాగా, సిద్ధిపేట జిల్లా మర్కుర్ మండలం పాతూరుకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఈరన్న శ్రీజ (17) కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భ యంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఆ విద్యార్థిని 401 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. బుధవారం ఉదయం ఈ ఫలితాలు వెల్లడికాగా శ్రీజ అంతకుముందే అర్థరాత్రి ఈ విషాదకర నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments