హైదరాబాద్: గూగుల్ రోడ్డు, మెటా రోడ్డు, టీసీఎస్ రోడ్డు అని పేరు పెట్టాలి.. రేవంత్ రెడ్డి

సెల్వి
శుక్రవారం, 14 నవంబరు 2025 (11:25 IST)
google meta
త్వరలో, హైదరాబాద్ వీధులు గూగుల్ రోడ్డు, మెటా రోడ్డు, టీసీఎస్ రోడ్డు వంటి పేర్లతో పిలవబడే అవకాశం వుంది. వార్షిక యూఎస్ఐఎస్‌పీఎఫ్ కాన్క్లేవ్ కోసం న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించారు. 
 
చాలా భారతీయ రహదారులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టారని, అయితే నేటి ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న కంపెనీలను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని రెడ్డి అన్నారు. 
 
గూగుల్, టిసిఎస్, మెటా వంటి గ్లోబల్ కార్పొరేట్ల పేర్లను రోడ్లకు పెట్టాలనే రేవంత్ రెడ్డి ఆలోచన ఆన్‌లైన్‌లో భారీ చర్చకు దారితీసింది. దాదాపు ప్రతి నగరంలో ఒక ఎంజీ రోడ్డు లేదా లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు ఉంది. చరిత్రను గుర్తుంచుకోవడం ముఖ్యమే. అయితే, మన దైనందిన జీవితాలను నిర్వచించే ఆధునిక సంస్థలను గుర్తు చేసుకునే రీతిలో ఈ పేర్లను వాడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 
ఈ ప్రతిపాదన భారతదేశం అంతటా అందరి దృష్టిని ఆకర్షించింది. కాంక్లేవ్ సందర్భంగా, రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయమని అగ్రశ్రేణి ప్రపంచ విశ్వవిద్యాలయాలను కూడా ఆహ్వానించారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ లేదా ఆక్స్‌ఫర్డ్ వంటి సంస్థలు నగరంలో కేంద్రాలను తెరిచినప్పుడు, గ్లోబల్ సౌత్‌లోని విద్యార్థులు సులభంగా యాక్సెస్ తక్కువ అధ్యయన ఖర్చులను పొందుతారన్నా. 
 
యూఎస్ఐఎస్‌పీఎఫ్ కాంక్లేవ్ నుండి చాలా మంది సభ్యులు డిసెంబర్ 8- 9, 2025 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments