Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ - వరుసగా ఆరోసారి అగ్రస్థానం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (20:51 IST)
హైదరాబాద్ నగరానికి మరోమారు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాల జాబితాలో హైదరాబాద్‌లో నిలిచింది. ఈ మేరకు మెర్సర్స్‌ క్వాలిటీ ఆప్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో పూణె, బెంగుళూరు, చెన్నై నగరాలు నిలిచాయని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు పేరిట మెర్సర్స్ కంపెనీ విడుదల చేసింది. 
 
ఇందులో వియన్నా (ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర, అద్భుతమైన కట్టడాలు, సాంస్కృతిక వంటి వివిధ కారణాలతో వియన్నా అత్యంత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలిచింది. వియన్నా తర్వాత రెండో స్థానంలో జురిచ్ (స్విట్జర్లాండ్), మూడో స్థానంలో అక్లాండ్ (న్యూజిలాండ్) నిలించాయి. 
 
ఇక భారత్ విషయానికొస్తే ఈ జాబితాలో హైదరాబాద్ (153వ స్థానం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పూణె (154) రెండో స్థానం, బెంగుళూరు (156) మూడో స్థానం, చెన్నై (161) నాలుగో స్థానం, ముంబై (164) ఐదో స్థానం, కోల్‌కతా (170) ఆరో స్థానం, న్యూఢిల్లీ (172) ఏడో స్థానంలో నిలిచాయి. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో ఖర్టౌమ్ (సూడాన్) 241వ ర్యాంకు అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత ఇరాక్‌లోని బాగ్దాద్ 240వ ర్యాంకులో ఉంది. ఇక ఆఫ్రికన్ నగరాలైన ఎన్.జమీనా (చాడ్), బంగూయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్) నగరాలు 236, 239 ర్యాంకులతో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments