Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేదాన్ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం... దట్టంగా కమ్ముకున్న పొగలు

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (09:28 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కాటేదాన్‌లో ఉన్న ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బరు పరిశ్రమలో ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చెలరేగి, పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. 
 
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఫైరింజిన్ విభాగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మొత్తం నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దించి మంటలను అదుపు చేశాయి. 
 
పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడి సరుకు ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగలు కమ్ముకుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి చివరకు మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. ఈ ప్రమాదం కారణఁగా జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments