హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (22:58 IST)
చైన్ స్నాచింగ్‌ల్లా ప్రస్తుతం మొబైల్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. దాన్ని పక్కా ప్లాన్‌తో లాక్కెళ్లే దొంగల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అరెస్టయిన వ్యక్తులు స్టీవ్ జాసన్ (19), వేముల సాయి సంతోష్ (19), ఓర్సు గణేష్ అలియాస్ ఘని (19)లుగా గుర్తించారు. స్టీవ్ జాసన్ గతంలో గోపాలపురంలో ఓ కేసులో చిక్కుకున్నాడు. వీరిపై ఇప్పటికే కేసులున్నారు. వీరు ఖర్చుల కోసం బైక్‌లు దొంగిలించడంతోపాటు మొబైల్‌ ఫోన్లు లాక్కునేవారు. ఎత్తుకెళ్లిన మొబైల్స్‌ను సంతోష్‌, గణేష్‌లకు విక్రయించేవారు. 
 
జూన్ 25న సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ వద్ద రైడ్ కన్ఫర్మేషన్ కోసం ఓ కస్టమర్ క్యాబ్ పక్కన మొబైల్‌ని చూస్తుండగా, ఇద్దరూ బైక్‌పై అతని వద్దకు వచ్చి, మొబైల్ లాక్కొని అక్కడ నుండి వేగంగా పారిపోయారు. దీనిపై సదరు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments