మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (13:55 IST)
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరందాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా తెలంగాణాలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వరద ముప్పుపొంచివున్న జిల్లాల్లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. 
 
అదేసమయంలో వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. 
 
ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయంతెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments