కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

సెల్వి
శనివారం, 6 జులై 2024 (12:58 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే, గతంలో కేసీఆర్‌కు కుడిభుజంగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా కేసీఆర్‌కు హ్యాండిచ్చి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. భారత రాష్ట్ర సమితికి ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. కాగా, మున్ముందు కూడా మరికొందరు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments