ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:33 IST)
గతంలో హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు మహ్మద్ రహేల్‌ అమీర్‌ను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వచ్చిన రహేల్‌ను సోమవారం పోలీసులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అతని కోసం గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. అయితే, ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు. 
 
ఈ ప్రమాదం తర్వాత రహేల్‌ బదులుగా మరొకరిని డ్రైవర్‌గా చేరి రహేల్‌ను దుబాయ్‌కు పారిపోయేలా కొందరు పోలీసులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు రహేల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో సోమవారం రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగిరాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments