Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలారా... ఇకపై మీరు కరెంటు బిల్లులు కట్టవద్దు: కేటీఆర్ పిలుపు

ఐవీఆర్
శనివారం, 20 జనవరి 2024 (14:22 IST)
తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనీ, అందువల్ల ఈ నెల నుంచి తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో కరెంటు బిల్లులను సోనియా గాంధీ కడతారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసారు. కనుక అధికారంలోకి వచ్చారు కనుక కరెంటు బిల్లులు ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేసారు. ఇకపై ప్రజలు తమ కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలని అన్నారు.
 
మరోవైపు భారాసను 100 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులో పాతిపెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 100 మీటర్ల లోతులో గొయ్యి తీసి పాతిపెట్టే విషయం తర్వాత చూద్దాం... మీరు ముందు ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలంగాణ జెండాకు బొంద పెడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్న విషయాన్ని ముందుగా ఆచరించి చూపాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments