Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదోడి బిడ్డ ముఖ్యమంత్రి కావడాన్ని దొర కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (08:37 IST)
పాలమూరు వాసి, పెదోడి బిడ్డ ముఖ్యమంత్రి కావడాన్ని దొర కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్.. పదేళ్ళ కాలంలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు. పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరల ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా పెద్ బిడ్డలు కూర్చోవద్దా అంటూ ఆయన నిలదీశారు. జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్, గులాబీ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. 
 
తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్లవద్ద ఉంచారని సీఎం రేవంత్ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెబుతున్నారని దుయ్యబట్టారు. వంద రోజులకే తనను గద్దె దించాలని కేసీఆర్ అంటున్నారని కానీ, పదేళ్ళుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీని గద్దె దించాలని ఎదుకు అనండం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని, కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాన్ని మాఫీ చేయలేకపోయామన్నారు. వచ్చే యేడాది వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ను తప్పకుండా ఇస్తామని తెలిపారు. 
 
"ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ రావడం వల్ల రైతు రుణమాఫీ చేయలేకపోయాను. అందుకే నారాయణపేట గడ్డపై నుంచి తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా... ఆగస్టు 15వ తేదీ లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాను. ఎట్లైతే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసానో, ఎట్లైతే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించానో అదేవిధంగా ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణామాఫీ చేసే బాధ్యత నాది అని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments