Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్: తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (21:02 IST)
KTR_Revanth
తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగంపై చర్చ ప్రారంభమైంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కాంగ్రెస్ హయాంలో ఆయన విమర్శించారు. 
 
కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్ని విధాలా అన్యాయం జరిగిందన్నారు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతం సర్వనాశనమైందన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రాంతం సర్వనాశనం అయిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. 
 
కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం, భట్టి విక్రమార్క మైక్ తీసుకుని కేటీఆర్ మాట్లాడుతున్న తీరుపై విమర్శలు గుప్పించారు. సభను ప్రజాస్వామ్యయుతంగా నడపాలని నిర్ణయించుకున్నామని, అయితే కేటీఆర్ మాట్లాడుతున్న తీరు అలా లేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 
 
గత ప్రభుత్వాల నిర్ణయాల గురించి మాట్లాడవద్దని, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడాలని కేటీఆర్‌కు సూచించారు. కాంగ్రెస్ సభ్యులు ఇందిరమ్మ పాలనపై మాట్లాడితే తమ హయాంలో జరిగిన అరాచకాల గురించి కూడా మాట్లాడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
కాంగ్రెస్‌కు 64 సీట్లు ఉంటే, తమకు కూడా 39 సీట్లు ఉన్నాయని, ఓట్ల షేరింగ్‌లో పెద్దగా తేడా లేదని గుర్తు చేశారు. విద్యుత్ అప్పులతోపాటు పలు అంశాలను కేటీఆర్ వివరించారు. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేశామని, జిల్లా వైద్య కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
రాష్ట్రం ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. కొత్త సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించిందని అన్నారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో అవాస్తవాలు చెప్పారన్నారు.

నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వాడీవేడీ చర్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments