అపుడు నా వెనుకనే ఉన్నావ్.. నిక్కి నిక్కి చూశావ్.. రేవంత్ రెడ్డిపై హరీష్ ఫైర్ (Video)

వరుణ్
గురువారం, 1 ఆగస్టు 2024 (18:06 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీష్ రావు మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు మంత్రి పదవి ఎవరి వల్లనో రాలేదని స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము చేరామని, పదవులు కోసం కానేకాదని స్పష్టం చేశారు. 
 
పైగా, తనకు మంత్రి పదవి వచ్చినపుడు టీఆర్ఎస్‌లోనే మీరు ఉన్నారనీ, అపుడు జరిగిన ఊరేగింపులోనూ మీరు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా మీరు నా వెనకే ఉంటూ, నిక్కి నిక్కి చూశావంటూ దెప్పిపొడిచారు. ఇదంతా మీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావంటూ మండిపడ్డారు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది రెవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 
 
తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది అని అన్నారు. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర మీది అంటూ మండిపడ్డారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీది, ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా మాట్లాడే చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా, గతంలో తన వెనుక రేవంత్ రెడ్డి నిలబడివున్న వీడియోను కూడా హరీష్ రావు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments