ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (14:35 IST)
తనకు తొలి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని హైదరాబాద్, గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టంచేశారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన గురువారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడారు. 
 
కొంతకాలంగా తాను పార్టీ మారబోతున్నట్టు, కొత్త పార్టీని స్థాపించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ తాను ఏ పార్టీలో చేరలేదని గుర్తుచేశారు. అసలు తనకు పార్టీ మారే ఆలోచన చేయలేదన్నారు. సస్పెండ్ చేసినపుడే తాను పార్టీ మారలేదన్నారు. ఇపుడు బీజేపీని వీడి వెళ్ళను అని చెప్పారు. తనకు మొదటి పార్టీ టీడీపీ అని చివరి పార్టీ బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల వల్లే పార్టీలో కొనసాగుతున్నాని, లేకపోతో ఎపుడో పార్టీని వీడిపోయేవాడినని చెప్పారు. తనకు మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీని వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్ప.. మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నవ వారిని కూడా వదలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments