Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

ఐవీఆర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (16:10 IST)
Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి గురించి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశ నాయకులు ఐసిస్ ఉగ్రవాదుల్లా మారుతున్నారా, అమాయకులను పొట్టనబెట్టుకుంటుంటే ఏ దేశమూ మౌనంగా చూస్తూ కూర్చోదు అంటూ పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి (Asaduddin Owaisi). ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయక పౌరులను చంపేసారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు వుంటే భారతదేశం భయడుతుందా.. అది జరగని పని.
 
అభివృద్ధిలో భారతదేశం కంటే 50 ఏళ్లు వెనకబడి పోయిన పాకిస్తాన్ ఏమీ చేతకాక ఇలాంటి పనులు చేస్తోంది. మా దేశంలోకి అక్రమంగా చొరబడి దాడులు చేస్తూ వుంటే ఎవరూ ఊరుకోరు అంటూ హెచ్చరించారు.
 
యుద్ధ భయంతో 5 వేలమంది పాక్ సైనికులు రాజీనామా
Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమాయక పర్యాటకులపై నీచమైన దాడి చేసి ఉగ్రవాదుల హతమార్చడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో యుద్ధం జరుగుతుందన్న ఆందోళనతో పాకిస్తాన్ దేశానికి చెందిన వేలమంది సైనికులు వందలమంది అధికారులు తమతమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వుండటంతో యుద్ధం వస్తే తమవారిని ఎక్కడ పోగొట్టుకోవలసి వస్తుందోనని పేరెంట్స్ రాజీనామా చేసి వెనక్కి వచ్చేయాలంటూ వత్తిడి తెస్తున్నారట. దీనితో ఇప్పటికే రాజీనామా లేఖలు సమర్పించిన వారి సంఖ్య దాదాపు 5,000 మించిపోయినట్లు చెబుతున్నారు. వీరి రాజీనామానాలను ఆమోదించకూడదని పాక్ ఆర్మీ హైకమాండ్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

తర్వాతి కథనం
Show comments