కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగేందుకు వెళ్లగా అతనికి తేరుకోలేని షాకి తగిలింది. శారీరక ఉపశమనం కోసం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లి కల్లీ సీసాను కూలీ కొనుగోలు చేయగా, అందులో ఉన్న కట్లపామును చూసి షాక్‌కు గురయ్యాడు. గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూలు జిల్లాలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి కల్లు దుకారణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడంతో అందులోని కట్లపాము నోటికికాడికి వచ్చింది. దానిని ఉమ్మివేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. 
 
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఇదేంటని కల్లీకల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా కలిసి ఆ కల్లు దుకాణాన్ని, సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయం అబార్కీ శాఖ అధికారులకు చేరడంతో వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments