Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఐవీఆర్
బుధవారం, 1 మే 2024 (12:30 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బోరబండలోని రెండు పండ్ల గోదాముల్లో హైదరాబాద్ పోలీసుల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించి ఇథిలిన్‌తో కృత్రిమంగా పండించిన సుమారు 4,800 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని హెచ్‌ఎఫ్ నగర్‌లోని ఓ పండ్ల గోదాములో మేనేజర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల మోయిజ్‌ను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కృత్రిమంగా పండించిన మామిడి పళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రేలో 20 కిలోల పండ్లను, పలు ఇథిలిన్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
అలాగే హైదరాబాద్‌లోని బోరబండలోని సంజయ్ నగర్‌కు చెందిన 47 ఏళ్ల పండ్ల వ్యాపారి సాదిక్‌ను అరెస్టు చేసి 80 ట్రేల మామిడి పండ్లను, రైప్నింగ్ ఏజెంట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని పండ్ల సరఫరాదారుల బృందం ఈ సీజన్‌లో మామిడితో సహా వివిధ పండ్ల దుకాణాలు, జ్యూస్ సెంటర్‌లకు పండ్లను అందజేస్తుంది. అయితే, పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో, ఈ సరఫరాదారులు ఇథిలిన్ వంటి కృత్రిమంగా పండించే రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
 
హైదరాబాద్ అధికారుల వారి ప్రకటన ప్రకారం, ఈ రసాయనాలు అధిక మొత్తంలో వాడినప్పుడు చర్మం కాలినట్లు గాయాలు అవుతాయి. అలాగే చికాకు, వాపు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. ఇలా కృత్రిమంగా పండించిన మామిడి పండ్లలో వుండే ఆర్సెనిక్‌ను పీల్చడం వల్ల హెవీ మెటల్ పాయిజనింగ్, ఇతర నరాల సమస్యలు వస్తాయి. కనుక మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments