Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీతి ఆయోగ్' పరిధిలో సబ్ కమిటీ వేయాలి... కేసీఆర్

Webdunia
సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (09:42 IST)
కేంద్ర పథకాల కొనసాగింపుపై నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన 'నీతి ఆయోగ్' తొలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రానికి వివరించారు. స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులను మంజూరు చేయాలని కేసీఆర్ కోరారు. 
 
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర పథకాల యదాతథంగా కొనసాగించే విధంగా నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేసీఆర్ కోరారు. ఈ అంశంపై కేసీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పథకాలకు కేంద్రం భారీగా నిధులు ఇవ్వాలని సమావేశంలో కోరారు. 
 
కాగా సమావేశ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్బంధ విద్య అమలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మోడీని కోరినట్టు కేసీఆర్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments