టి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ఆంధ్రా కోర్టు సమన్లు..

Webdunia
శుక్రవారం, 5 డిశెంబరు 2014 (13:38 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ సూచించారు.
 
గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లో కొండామర్రిపల్లె సమీపంలో గాయిత్రీస్టోన్ క్రషర్స్‌లో 39 మంది కూలీలకు తక్కువ జీతం ఇస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో గుర్తించిన స్మితదాస్ యజమాన్యం క్రిష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వెట్టిచాకిరీ చేస్తున్న వారికి విముక్తి కల్పించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది.
 
కాగా 2009 నుంచి స్మితదాస్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మదనపల్లె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. స్మితాదాస్ 2003 నుంచి 2009 వరకు మదనపల్లె కోర్టుకు హాజరైన స్మితాదాస్‌, ఆ తరువాత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈనెల 15వ తేదీ లోపు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆమెకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

Show comments