కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ఎన్నికల పర్యటన సందర్భంగా కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కాటిపల్లి ఏమన్నారో చూద్దాం.
తన పేరును అడిగినప్పుడు ఎవరతను అంటూ పక్కవాళ్లను కేటీఆర్ అడిగారనీ, కేటీఆర్ పక్కన ఏమీ తెలియని పిచ్చోళ్లు వుంటారనీ, తన పక్కన మాత్రం అంతా మంచివాళ్లు వుంటారని అన్నారు. గుర్తుపెట్టుకోండి... ఈ ఎన్నికల్లో మీకు మీ నాయనకు యావజ్జీవితం నేను జ్ఞాపకం వుంటా అంటూ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో క్రింద చూడండి.
కామారెడ్డికి పోయి టిల్లుగాడు చాలా బలుపు మాటలు మాట్లాడిండు.