Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీలు.. ప్లీజ్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయండి...

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (14:23 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపుగా 39 శాతం మేరకు పోలింగ్ పోలైంది. అయితే, చాలా ప్రాంతాల్లో చాలా తక్కువగా పోలింగ్ నమోదైంద. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో మధ్యాహ్నం 11 గంటల వరకు కేవలం 20 శాతం మేరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా తక్కువగా నమోదైంది. 
 
హైదరాబాద్ నగరంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి మూడు గంటల్లో అంటే పది గంటల వరకు హైదరాబాద్‌‍లో నమోదైన పోలింగ్ కేవలం 5 శాతం. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది. ఉదయం పది గంటల వరకు నాంపల్లిలో అత్యల్పంగా 0.5 శాతం, సనత్ నగర్ 1.2 శాతం, కూకట్పల్లిలో 1.9 శాతం, మేడ్చల్లో 2 శాతం, గోషామహల్లో 2 శాతం, చార్మినార్ లో 3 శాతం, ముషీరాబాద్లో 4 శాతం, రాజేంద్రనగర్లో 15 శాం పోలింగ్ నమోదైంది.
 
హైదరాబాదీలు... దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి.. మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది... ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని ఎన్నికల అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు, సినీ సెలెబ్రిటీలు చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుమ కనకాల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ శాతంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో చాలా తక్కువగా ఉంటోంది.
 
ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: తమన్నా లా అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నా : హెబ్బా పటేల్

కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు గా కళ్యాణ్ రామ్

Surya: గేమ్ ఛేంజర్ వల్ల సూర్య రెట్రో లో మెయిన్ విలన్ మిస్ అయ్యింది : నవీన్ చంద్ర

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments