Webdunia - Bharat's app for daily news and videos

Install App

4న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. సీఎంఓ ప్రకటన

సెల్వి
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (20:05 IST)
ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
తెలంగాణ మూడో శాసనసభకు నవంబర్ 30న ఎన్నికలు పూర్తి కాగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 2024 జనవరి 16 వరకు కొనసాగుతుంది. 
 
అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో డిసెంబర్ 3న ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిని నియమించే వరకు కేసీఆర్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే డిసెంబర్ 3న వచ్చే ఫలితాలను బట్టి ఈ కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. 
 
కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తారా? లేక రద్దు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే తరుణంలో కేబినెట్ భేటీ అంశం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ సభ యథావిధిగా జరుగుతుందని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments