Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంద్రాయణగుట్టలో అక్బరుద్ధీన్‌కు తిరుగులేదు.. ఐదోసారి కూడా..?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:50 IST)
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి బోణీ కొట్టింది. ఇక చాంద్రాయగుట్టలో అక్బరుద్ధీన్ ఓవైసీ గెలుపును నమోదు చేసుకున్నారు. ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాం రెడ్డిపై ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి అక్బరుద్ధీన్ ఓవైసీ ఆధిక్యత కనబరుస్తూనే వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరులో వున్నప్పటికీ.. ఈ నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. 
 
కాంగ్రెస్ అభ్యర్థి ఈస మిస్త్రీ కానీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి మహ్మద్ కాజీ కానీ రాణించలేకపోయారు. గ్రేటర్ హైదరాబాదులో టీడీపీ పూర్తిగా గల్లంతైంది. అయితే చాంద్రాయణగుట్టలో మాత్రం అక్బరుద్ధీన్‌కు తిరుగులేదు. ఇప్పటికే 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపును నమోదు చేసుకుంటున్న ఓవైసీ.. ఐదోసారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఇదిలా ఉంటే.. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ మంత్రి హరీశ్‌రావు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్‌ ముగిసే సరికి ఆయన 19,925 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ సైతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌ ఫలితాలు వెలువడే సరికి ఆయన 4764 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

తర్వాతి కథనం
Show comments