Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందమంది కేసీఆర్‌లు వచ్చినా...పాతాళానికి తొక్కేస్తానన్న రేవంత్.. అందుకే అరెస్ట్?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:18 IST)
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి అడుగుపెట్టనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి శక్తియుక్తులను మోహరించింది. ఇంకా టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రత్యేకంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా కేంద్రీకరించారు. 
 
కొండగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెరాస చీఫ్ కేసీఆర్ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను అడ్డుకునేందుకు తొలుత రేవంత్ రెడ్డి కొండగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ ఆ తర్వాత ఆ బంద్‌ను రేవంత్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. కేసీఆర్ సభ సందర్భంగా నిరసన ర్యాలీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
వంద మంది కేసీఆర్‌లు వచ్చినా కూడా పాతాళానికి తొక్కేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మంగళవారం కేసీఆర్ సభ కొడంగల్‌లో జరుగనున్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసీ ఆదేశాలను పురస్కరించుకొని తాము అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు రేవంత్ రెడ్డికి ఆదేశాలను చూపినట్టు పోలీసులు చెప్తున్నారు. కేసీఆర్ సభ పూర్తయ్యేంతవరకు రేవంత్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోనే వుంచుకుంటారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments