Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించి కొడంగల్‌లో కేసీఆర్ సభ

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (09:01 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫైర్‍బ్రాండ్‌గా ఉన్న అనుమోలు రేవంత్ రెడ్డిని పోలీసులు మంగళవారం వేకువజామున అరెస్టు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
వాస్తానికి రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌ కుటుంబంపైనా ప్రతి సందర్భంలోనూ నిప్పులు చెరిగుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌ కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా, రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని అందులో పేర్కొన్నారు. 
 
దీంతో ఎన్నికల సంఘం ఆదేశం మేరకు రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రేవంత్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీనిపై రేవంత్ భార్య ఆందోళన చెందుతోంది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చినట్లు రేవంత్ అనుచరులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ
 
కాగా రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే బొమ్మరాస్‌పేటలో మంగళవారం సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments