Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధ‌ర్మాన్ని ర‌క్షించాల‌నుకుంటే బీజేపీకే ఓటు వేయండి : స్వామి ప‌రిపూర్ణానంద‌

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (18:35 IST)
మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ఎన్. రామ‌చంద్ర‌రావు ప్ర‌చారంలో స్పీడు పెంచారు. స్ధానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి చాలా ఉత్సాహంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్.రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ… ఇప్ప‌టికే రెండుసార్లు పాద‌యాత్ర‌లు చేసాం. రోడ్ షాలు చేసాం. ఇంటింటికి వెళ్లి కూడా ప్ర‌చారం చేస్తున్నాం. కార్య‌క‌ర్త‌లు చాలా ఉత్సాహంగా నిద్ర అనేది లేకుండా ప‌ని చేస్తున్నారు. త‌ప్ప‌కుండా ప్ర‌జ‌లు మా క‌ష్టాన్ని త‌గ్గ‌ట్టు ఓటు వేసి గెలిపిస్తార‌ని భావిస్తున్నాం అని చెప్పారు.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ స‌మ‌స్య‌ల‌ను ఖ‌చ్చితంగా ప‌రిష్కారిస్తాన‌ని హామీ ఇస్తున్నాను అని అన్నారు. లోతుకుంట నుంచి ఓల్డ్ అల్వాల్‌లో గ‌ల ఐజీ విగ్ర‌హం వ‌ర‌కు దేశం కోసం ధ‌ర్మం కోసం అంటూ స్వామి ప‌రిపూర్ణానంద‌తో క‌లిసి ఎన్. రామ‌చంద్ర‌రావు రోడ్ షో నిర్వ‌హించారు. ఈ రోడ్ షోలో స్వామి ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ… ఎవ‌రైతే హిందు ధ‌ర్మాన్ని ర‌క్షించాల‌నుకుంటున్నారో వాళ్లు బీజేపీకి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఒక‌వేళ టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే ఎంఐఎంకి ఓటు వేసిన‌ట్టే అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

తర్వాతి కథనం
Show comments