Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ గెలిచాక గడ్డం తీసేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (09:39 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ సారథ్యంలోని ప్రజా కూటమి విజయం సాధిస్తే తన గడ్డం తీసేస్తానని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమికి 75 నుంచి 80 స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను గడ్డం తీసేస్తానని తెలిపారు. 
 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్డం తీస్తానని గతంలో ప్రకటించిన ఉత్తమ్‌... ఈ నెల 11 లేదా 12వ తేదీన గడ్డం తీయనున్నట్లు తెలిపారు. గతంలో 105, 106 స్థానాలు వస్తాయన్న కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇప్పుడు 80 వస్తాయని అంటున్నారని ఓట్ల లెక్కింపు తర్వాత 35కు మించి రావని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేక ఉందని, అందుకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టి ఓటు ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి కారణం తెరాస సర్కారుపై ఉన్న వ్యతిరేకతేనని ఉత్తమ్ విశ్లేషించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments