Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టండి.. ఎవరు వద్దన్నారు.. నారా లోకేష్

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా రావొచ్చునని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారని.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము వేలుపెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో.. నారా లోకేష్ కౌంటరిచ్చారు.
 
ఏపీలో ప్రజాస్వామ్యం వుందని.. అక్రమ అరెస్టులు, వేధింపులు, రౌడీయిజంలు లేవని చెప్పారు. కావాలనుకుంటే.. కేటీఆర్ ఆంధ్రాలోనూ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చునని ఎద్దేవా చేశారు. 
 
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని.. ఇలాంటి చర్యలను ప్రజలు ఎన్నటికీ అంగీకరించరన్నారు. డిసెంబర్ 11న వెలువడనున్న ఎన్నికల్లో మహా కూటమి విజయఢంకా మోగిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. అభివృద్ధి చేపట్టడం చేతకాక కేసీఆర్ సర్కారు తమపై అభాండాలు వేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

తర్వాతి కథనం
Show comments