'పోతారు సార్' అని కానిస్టేబులే చెప్పారు : గజ్వేల్ ఫలితంపై లగడపాటి సంచలన కామెంట్స్

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (13:07 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానం ఎన్నికల ఫలితంపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల సర్వేలో భాగంగా, గత అక్టోబరు నెల 28వ తేదీన తాను గజ్వేల్‌కు వెళ్లినట్టు లగడపాటి ప్రకటించారు. 
 
ఆ సమంయలో పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపి తనిఖీ చేశారని చెప్పారు. అపుడు తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో సెల్ఫీలు వారు దిగారన్నారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగితే.. దానికి వారు.. 'పోతారు సార్..' అని ఏడుగురు కానిస్టేబుళ్లు సమాధానమిచ్చారని చెప్పారు. 
 
గజ్వేల్‌లో ఎవరు పోతారో..? ఎవరు గెలుస్తారో...? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు. నిజం చేదు మాత్రలా ఉంటుందని, అందువల్లే కేసీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, ఈనెల 11వ తేదీ సాయంత్రం అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments