Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాంతానికి బ్లేడుతో బయలుదేరిన బండ్ల గణేష్... ఏం కోసుకుంటాడో?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా బ్లేడుతో నడిరోడ్డుపై కోసుకుని చనిపోతానంటూ చెప్పారు గణేష్. రాజకీయాల్లో ఇలాంటి మాటలు చెప్పడం మామూలేనని అనుకున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నేను చెప్పింది చేసి తీరుతానని తేల్చి చెప్పారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో టిఆర్ఎస్ వేగంగా ముందుకు వెళుతూ అధిక సీట్లను కైవసం చేసుకునే దిశగా ఉండటంతో బండ్ల గణేష్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తన ఇంటి నుంచి బ్లేడుతో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. గణేష్ వెంట 8 మంది స్నేహితులు కూడా ఉన్నారు. 
 
అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గణేష్‌ ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోవాలని ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సూచించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైడ్రామా నడిచే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments