సంక్రాంతి వంటలు: నువ్వుల అరిసెలు ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (16:57 IST)
సంక్రాంతికి సొంత గ్రామానికి వెళ్లిపోయారా.. పిండివంటలు చేయాలనుకుంటున్నారా.. అయితే నువ్వుల అరిసెలు ట్రై చేయండి. 
 
నువ్వుల అరిసెలకు కావలసిన పదార్థాలు:
బియ్యం - ఒక కేజీ 
బెల్లం - అర కేజీ 
నువ్వులు - 50 గ్రాములు 
నూనె - తగినంత 
 
తయారీ విధానం : 
ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. అందులో బియ్యం పిండిని వేసి బాగా కలిపి దించేయాలి. 
 
తరువాత స్టౌవ్‌ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిలో నువ్వులు చేర్చి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకుపై ఒత్తుకుని నూనెలో వేసి రెండువైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసేస్తే నువ్వుల అరిసెలు రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతర.. మైనర్ బాలికపై అత్యాచారం.. విచారణ కమిటీ

ఆస్తి వివాదం.. మహిళా న్యాయవాది అయిన చెల్లెల్ని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి చంపేశాడు..

హైవేలపై స్టంట్స్ చేస్తారా? తాట తీస్తాం.. ముగ్గురు ఆటో డ్రైవర్ల అరెస్ట్

Polavaram: గోదావరి పుష్కరాలు.. పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకింతం చేస్తారా?

ఓటు ప్రాథమిక హక్కు.. దాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోంది : కమల్ హాసన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

Show comments