విజయదశమి నైవేద్యం: రవ్వతో చక్రపొంగలి ఎలా చేస్తారు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2015 (16:59 IST)
విజయదశమికి నైవేద్యంగా చక్ర పొంగలి, గారెలు, పాయసం చేసేస్తుంటాం. అయితే చక్ర పొంగలి బియ్యంతో కాకుండా రవ్వతో ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు :
ఎండు కొబ్బరి ముక్కలు - రెండు కప్పులు 
నెయ్యి - అర కప్పు
జీడిపప్పు - అర కప్పు 
యాలకుల పొడి - పావు స్పూన్ 
పంచదార - ఒక కప్పు 
బెల్లం- పావు కప్పు 
బియ్యం రవ్వ - పావు కిలో 
పెసరపప్పు - పావు కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా పాత్రలో బియ్యం రవ్వను, పెసరప్పును కలుపుకుని పొడిగా ఉండేట్లు ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. మరో పాత్రలో పంచదార, బెల్లంపొడిని కలుపుకుని కొద్దిగా నీళ్లు పోసి లేత పాకం పట్టాలి. పాకం వచ్చిన తర్వాత దించుకునే ముందు యాలకుల పొడి చేర్చాలి. ఒక బేసిన్ తీసుకుని అందులో బియ్యం రవ్వ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని అందులో పాకాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి పొంగలిలో కలుపుకోవాలి. అంతే రవ్వ చక్ర పొంగలి రెడీ అయిపోయినట్లే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్‌... ఏపీ ఫైబర్‌నెట్ సేవ కింద..?

భీకరమైన బీభత్సం సృష్టించే క్షిపణులు సృష్టించా, ఇవి నా జీవిత కాలంలో ఉపయోగించలేనా? ఎవరు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం - నిగ్గు తేల్చాలన్న సీఎం చంద్రబాబు

అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం

పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

Show comments