"అనాస-జీడిపప్పు హల్వా" తయారీ ఎలా?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:01 IST)
కావలసిన పదార్థాలు :
అనాసపండు తురుము.. నాలుగు కప్పులు
పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు
పంచదార.. రెండు కప్పులు
జీడిపప్పులు.. అరకప్పు
బాదంపప్పు.. పావు కప్పు
పిస్తా పప్పులు.. కాసిన్ని
కోవా.. అర కప్పు
ఎల్లో ఫుడ్ కలర్.. ఆరు చుక్కలు
ఫైనాఫిల్ ఎసెన్స్.. ఆరు చుక్కలు
నెయ్యి.. రెండు టీస్పూన్లు
 
తయారీ విధానం :
ఒక పాత్రలో నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి పక్కనుంచాలి. అదే పాత్రలో అనాసపండు తురుము, కొబ్బరి తురుములను ఒకదాని తర్వాత ఒకటి వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. దానికి పంచదారను కూడా జతచేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత నేతిలో వేయించి జీడి, బాదం, పిస్తా పప్పులతో అందంగా అలంకరించి సర్వ్ చేస్తే సరి..! అంతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే అనాస హల్వా తయార్..! 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Hikes Liquor Price: ఏపీలో లిక్కర్ ధరలు పెంపు

కదిలే కారులో సామూహిక అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు..గంటల తరబడి..?

Nimmala : మిగులు జలాలు ఉంటే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చు.. నిమ్మల

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత- రేవంత్ రెడ్డి

బాపట్ల సూర్యలంకకు మహర్దశ, ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?

Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్

Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్

Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్

Show comments