రుచికరమైన ఓట్స్‌ స్వీట్ స్టిక్స్

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (15:36 IST)
కావలసిన వస్తువులు :
 
ఓట్స్‌పిండి - రెండు కప్పులు
 
గోధుమపిండి - ఒక కప్పు
 
మైదా - ఒక కప్పు
 
బెల్లం - రెండు కప్పులు
 
వెన్న - కొంచెం
 
ఉప్పు - చిటికెడు
 
ఏలకుల పొడి - పావు టీ స్పూను
 
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 
 
తయారుచేయండి ఇలా :
మొదట ఒక గిన్నెలో ఓట్స్‌ పిండి, గోధుమపిండి, మైదా, వెన్న, ఉప్పు, కొద్దిగా నీరు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అయిదు నిముషాలు నానిన తరువాత కొద్దిగా పిండి తీసుకుని ఫొటోలో మాదిరిగా ఒత్తుకోవాలి. బాణలిలో సన్నసెగ మీద కాగిన నూనెలో వీటి ని వేసి దోరగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీరు పోసి ఉండపాకం రానిచ్చిన తరువాత అందులో ఏలకుల పొడి వేయాలి. చివరగా వేయించుకున్న స్టిక్స్‌ని ఇందులో వేసి స్టౌవ్ మీద నుంచి దించేయాలి. అంతే రుచికరమైన ఓట్స్‌ స్వీట్ స్టిక్స్ రెడీ. వీటిని చిన్న పిల్లలు చాలా ఇష్టంగా ఆరగిస్తారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

Show comments