రుచికరమైన ఎగ్ లెస్ కేక్

Webdunia
మంగళవారం, 23 డిశెంబరు 2014 (17:55 IST)
కావల్సిన పదార్థాలు: 
మైదా - ఒక కప్పు 
కండెన్స్డ్ మిల్క్ - 1/2 కప్పు
పంచదార పౌడర్ - 1/4 కప్పు
జీడిపప్పు - ఒక టేబుల్ స్పూన్
ద్రాక్ష - ఒక టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా - 1/4 స్పూన్
బేకింగ్ పౌడర్ - 1/2 స్పూన్
బట్టర్ - 1/4 కప్పు
పాలు - 1/2 కప్పు
ఉప్పు - చిటికెడు
గ్రీస్ తయారీకి :
బట్టర్ - ఒక టేబుల్ స్పూన్
మైదా  - ఒక టేబుల్ స్పూన్
 
తయారు చేయండి ఇలా :
మొదట దా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మూడింటిని బాగా మిక్స్ చేసి జల్లు పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి, బట్టర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బట్టర్ స్మూత్‌గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కండెన్డ్ మిల్క్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. అందులోనే సగం పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్‌గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి.
 
తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అడుగున ఒక కప్పు ఉప్పు వేసి మంటను మీడియంగా పెట్టి, ఉప్పును వేడెక్కనివ్వాలి. కండెన్స్డ్ మిల్క్ మైదా మిక్స్ ను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాగా గిలకొట్టాలి. పిండి మొత్తం స్మూత్ గా అయ్యే వరకూ ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. మరికొద్దిగా పాలు పోసి స్మూత్ గా కలుపుకోవాలి.
 
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్‌ను బేకింగ్ బౌల్‌కు రాసి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించి తర్వాత లోపలి బౌల్ లోపలిబాగాన్ని కవర్ చేయాలి. తర్వాత ఈ పిండి మిశ్రమంలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో మిక్స్ చేయాలి.
 
తర్వాత ఈ బేకింగ్ బౌల్‌ను విజిల్ పెట్టకండా కుక్కర్‌లో పెట్టి మూత పెట్టాలి. తక్కువ మంట మీద 30 - 40నిముషాలు ఉడికించుకోవాలి. 40 నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి.
 
ఇప్పుడు కేక్ తయారైందా అని టెస్ట్ చేయాలి. అందుకు ఒక చాకును కేకు లోపలికి చొప్పించి చూడాలి. పైకి తీసినప్పుడు, సులువగా చాకు బయటకు వస్తే అది తప్పనిసరిగా కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి ఉగించుకోవాలి. 
 
కేక్ రెడీ అయిన తర్వాత బేకింగ్ బౌల్‌ను బయటకు తీసి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్‌ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్‌ను నిధానంగా రిమూవ్ చేయాలి. కేక్ మొత్తం బటకు తీసుకొన్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన ఎగ్ లెస్ కేక్ రెడీ... దీనిని ఈ క్రిస్మస్ పండుగకు తయారు చేయండి. ఈ కేక్ తయారీకి వొవెన్ అవసరం లేదు. ఎవరైనా ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమారుడు కావాలన్న కోరికతో కుమార్తెను హత్య చేసిన తల్లి

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

ప్రాణ స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధిరాలేదు... యువకుడు ఆత్మహత్య

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

ఏ బట్టల సత్తిగాడి మాటలు వినొద్దు.. ఇష్టమైన దుస్తులు ధరించండి : నిర్మాత ఎస్కేఎన్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

Show comments