Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోషకాల గని డ్రైఫ్రూట్స్ సమోసా

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (16:40 IST)
కావలసిన వస్తువులు :
 
మైదా పిండి - పావుకిలో
 
డాల్డా లేదా నెయ్యి - 50 గ్రాములు
 
కాజు, బాదం, కిస్‌మిస్, పిస్తా పప్పులు - అరకప్పు (అన్నీ కలిపి)
 
కోవా - అరకప్పు
 
ఏలకుల పొడి - అర టీ స్పూన్
 
లెమన్ పసుపు రంగు - మూడు చుక్కలు
 
చక్కెర - అరకేజీ 
 
నూనె - వేయించడానికి తగినంత
 
ఉప్పు - చిటికెడు
 
డ్రైఫ్రూట్స్ సమోసా తయారుచేయండి ఇలా : 
మొదట మైదా పిండిని జల్లించి, అందులో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరువాత అందులో తగినంత నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవానుపొడిగా చేయాలి. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మరో వైపు చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి. ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేసి, ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసివేయాలి. అంతే తియతియ్యటి డ్రైఫ్రూట్స్ సమోసా రెడీ. స్కూల్‌కు వెళ్లి అలసిపోయి వచ్చే పిల్లలకు ఈ డ్రైఫ్రూట్స్ సమోసా మంచి శక్తినిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments