శ్రీరామనవమి స్పెషల్: చలిమిడి ఎలా చేయాలి!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (14:37 IST)
శ్రీరామునికి ఇష్టమైన చలిమిడి ఎలా చేయాలో చూద్దాం.. ఇది శ్రీరామనవమి రోజున దేవునికి పెట్టే నైవేద్యాలలో ఒకటి.  
కావలసిన పదార్థాలు :
బియ్యం : 3 కప్పులు
బెల్లం తురుము : రెండు కప్పులు 
కొబ్బరి ముక్కలు : అర కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్   
గసగసాలు : ఒక టేబుల్‌స్పూన్ 
జీడిపప్పులు : పాపు కప్పు 
నెయ్యి : ఒక టీ స్పూన్
 
తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వడపోసి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి పొడి కొట్టాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే గసగసాలను వేయించాలి. యాలకులను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. చిక్కగా అయ్యాక కొద్దిగా నెయ్యి పోసి యాలకులపొడి, బియ్యం పిండి మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి గసగసాలు, వేయించుకున్న కొబ్బరి, జీడిపప్పులను వేసి కలపాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసు నన్ను మోసం చేసి వేరొకర్ని పెళ్లాడుతున్నాడు: ప్రధానికి వీడియో షేర్ చేసి యువతి సూసైడ్

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

Show comments