Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్‌‌తో కేక్ తయారీనా? ఎలా?

బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌ నిరోధించేందుకు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలా

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (14:37 IST)
బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌ నిరోధించేందుకు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మరి అటువంటి బీట్‌రూట్‌తో కేక్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
బీట్‌రూట్ - 2
మైదా పిండి - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
నూనె - 250 గ్రాములు
కోడిగుడ్డు - 4
బేకింగ్ పౌడర్ - 3 స్పూన్స్
ఉప్పు - కాస్త
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బీట్‌రూట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారుచేసుకున్న బీట్‌రూట్ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే బీట్‌రూట్ కేక్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments