Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంతో బీట్‌రూట్‌ బూరెలు

Webdunia
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్‌ తురుము...300గ్రా.
బెల్లం తురుము... ముప్పావుకేజి
నెయ్యి... 150గ్రా.
పచ్చిబియ్యం పిండి... ఒకకేజీ
నీళ్లు... తగినన్ని
రీఫైండ్ ఆయిల్... వేయించేందుకు సరిపడా
ఎండుకొబ్బరి తురుము... 200గ్రా.
యాలకులపొడి... ఒకటిన్నర టీ.

తయారీ విధానం :
ముందుగా బీట్‌రూట్‌ తురుములో కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళు ఇగిరే వరకూ వేయించి ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం తురుము, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. ఈ పాకంలో యాలకులపొడి వేసి గిన్నె దించాలి.

తరవాత బూరెలు, అరిసెల తయారీలో మాదిరిగానే పాకంలో ఓ చేత్తో పిండి పోస్తూ మరోచేత్తో తెడ్డుతో వేగంగా పిండి ఉండలు కట్టకుండా తిప్పాలి. ఇలా మొత్తం పిండి వేసిన తరవాత నెయ్యి, బీట్‌రూట్‌ తురుము, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి 20 నిమిషాలపాటు మూతపెట్టి ఉంచితే పిండి చక్కగా మగ్గుతుంది.

ఇప్పుడు కడాయిలో నూనెపోసి కాగనివ్వాలి. పైన కలిపి ఉంచిన పిండిని చిన్నచిన్న ముద్దలుగా ప్లాస్టిక్‌ పేపరుమీద బూరెల (బిళ్లలు) మాదిరిగా వత్తి నూనెలో వేసి, వేయించి తీసేయాలి. అంతే బీట్‌రూట్ బూరెలు తయారైనట్లే..! ఎన్నో పోషక విలువలుండే ఈ బీట్‌రూట్‌ బూరెలు పదిహేనురోజుల వరకూ నిల్వ ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

Show comments