కృష్ణాష్టమి : వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలమట!

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (15:58 IST)
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. 
 
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
 
"ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును" అని చెప్పియున్నాడు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతమాచరించి నిష్ఠతో ఆ దేవదేవుడిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంతో ఆడుకుంటున్న ఇరాన్, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది

హృద్యమైన ప్రేమకథ.. ఎత్తు లేకపోతేనేం.. పర్లేదు వివాహం చేసుకున్న యువతి

చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో

పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన

భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

Show comments