Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పండుగ విశిష్టత ఏమిటో తెలుసా..!?

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2011 (19:18 IST)
FILE
" బ్రహ్మ" గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభి ం చు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం.

అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగనస్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావజీవితాలు మృదుమధురంగా సాగించాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఉంటారు.

ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు.

ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు.

ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Show comments