Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ పసిఫిక్ ఓపెన్ : జంకోవిచ్ ఇంటిముఖం

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (16:20 IST)
టోక్యో వేదికగా జరుగుతోన్న పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలో దిగిన సెర్బియా క్రీడాకారిణి జెలీనా జంకోవిచ్ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. రష్యా క్రీడాకారిణి స్వెత్లానా కుజ్నెత్సోవా చేతిలో ఓడిపోవడం ద్వారా జంకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణిగా కొనసాగుతోన్న జంకోవిచ్ ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కుజ్నెత్సోవా ధాటికి తలవంచక తప్పలేదు. క్వార్టర్ పోరును విశ్వాసంతో ప్రారంభించిన జంకోవిచ్ ప్రారంభంలో ధాటిగానే ఆడింది. దీంతో 6-2 తేడాతో తొలిసెట్ జంకోవిచ్ సొంతమైంది.

అయితే రెండో సెట్‌నుంచి కుజ్నెత్సోవా ఒక్కసారిగా జంకోవిచ్‌పై విరుచుకుపడింది. హోరాహోరీగా సాగిన రెండు సెట్లలోనూ 7-5, 7-5 తేడాతో కుజ్నెత్సోవా విజయం సాధించింది. తాజా విజయంతో కుజ్నెత్సోవా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

కొద్దిరోజుల క్రితం జరిగిన అమెరికా ఓపెన్‌లో సైతం ఫైనల్‌కు చేరుకున్న జంకోవిచ్ అక్కడ మాత్రం పూర్తి స్థాయి సత్తాను ప్రదర్శించలేక పోయింది. ఫైనల్ పోరులో అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌తో తలపడిన జంకోవిచ్ ఓటమి చవిచూసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచు సోదరులకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

జగన్మాత సాక్షాత్కారం కాలేదని కత్తితో గొంతుకోసుకున్న భక్తుడు!!

ఏపీ మారిటైమ్ పాలసీ రిలీజ్... నోడెల్ ఏజెన్సీగా మారిటైమ్ బోర్డు

డివైడర్‌ను ఢీకొన్న కారు.. లండన్‌లో తెలుగు టెక్కీ దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakmi Prasanna opinion: మంచు లక్మీ ప్రసన్న ఆంతర్యం ఏమిటి?

నిఖిల్ స్వయంభూ లో సుందర వల్లిగా నభా నటేష్

Google Search: గ్లోబల్ లీడర్‌గా పవన్ కళ్యాణ్.. రిజిస్టర్ అయిన "సీజ్ ది షిప్"టైటిల్

#PUSHPA2HitsFastest1000Cr : రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప రాజ్

Sai Pallavi Loses Cool: తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా... అభిమన్యు లవ్‌లో సాయిపల్లవి!

Show comments