Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచ కప్: భారత్ సంచలన విజయం

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2007 (21:40 IST)
ట్వంటీ-20 ప్రపంచ కప్: భారత్ సంచలన విజయం
జోహెన్స్‌బర్గ్ (ఏజెన్సీ)
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను "టీమ్ ఇండియా" కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమెట్ ధోనీ నేతృత్వంలోని 'యువసేన'దే పై చేయిగా నిలిచింది. లీగ్ మ్యాచ్‌లో బౌలౌట్ పద్దతిలో పాక్‌ను ఓడించిన భారత జట్టు సోమవారం జరిగిన మ్యాచ్‌లోను ఐదు పరుగులు తేడాతో గెలిచి ట్వంటీ-20 ప్రపంచ తొలి ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇర్ఫాన్ పఠాన్ సొంతం చేసుకున్నాడు.

అంతర్జాతీయ ఫైనల్ మ్యాచ్‌లో దాయాదులుగా పేరుగాంచిన పాకిస్తాన్-భారత్‌ జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై ఉన్న జోహెన్స్‌బర్గ్‌లోని వాండర్సన్ స్టేడియంలో తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. భారత జట్టులో గౌతం గంభీర్ (75), రోహిత్ శర్మ (30)లు మాత్రమే రాణించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో వీరబాదుడు బాదిన యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసి అవుట్ అయ్యాడు. అలాగే.. కెప్టెన్ ధోనీ కూడా కేవలం అరు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

దీంతో భారత్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్ ఉమర్ గుల్ 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి భారత్ వెన్ను విరిశాడు. అనంతరం 158 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు విజయం అంచులకు వచ్చి బోల్తాపడింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఒత్తిడిని తట్టుకోలేక అన్ని వికెట్లను కోల్పోయింది. మిషాబుల్ ఉల్ హక్ (43) చేసిన పరుగులే పాక్ జట్టులో అత్యధిక పరుగులు కావడం విశేషం.

అలాగే.. మ్యాచ్‌ను విజయం అంచులకు తీసుకొచ్చిన ఘనత కూడా మిషాబుల్‌కే చెందుతుంది. అయితే.. విజయానికి మరో ఆరు పరుగులు కావాల్సి ఉన్న సందర్భంలో.. మిషాబుల్ హక్ కొట్టిన షాట్ గాలిలోకి లేచింది. అంతే.. అందరిలోనూ ఒకే ఉత్కంఠత. దీంతో దాదాపు పాక్ విజయం సాధించిందనుకున్న తరుణంలో.. వికెట్ల వెనుక కాపుకాసి ఉన్న శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఒక్కసారి భారత్ శిబిరంలోనే కాకా.. టీవీ సెట్లముందు కూర్చుకున్న కోట్లాది మంది భారతీయులు ముఖాల్లో ఆనందసంభరాలు వెల్లివిరిశాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Show comments