Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగడ్డపై ఆడటం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది: కోహ్లీ

Webdunia
దక్షిణాఫ్రికా సిరీస్‌లో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా ఆటగాడిగా నిలిచిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడటం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ ఆడటం ద్వారా కొంత నేర్చుకున్నాడు. టాప్-క్లాస్, ఫాస్ట్ బౌలింగ్‌కు ధీటుగా ఆడటంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడికి లోనుకాకుండా ఎలా ఆడాలని కూడా కోహ్లీకి అర్థమైపోయింది.

ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడటం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని కోహ్లీ చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడటం సంతృప్తినిచ్చింది. అలాగే టెస్టు జట్టు అద్భుతంగా ఆడింది. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించడంలో మాత్రం టీమిండియా విఫలమైందన్నాడు.

చివరి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించడంతో టీమిండియా రికార్డుకు బ్రేక్ పడిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కానీ వన్డే ప్రపంచకప్‌లో తప్పకుండా రాణిస్తామని, సొంతగడ్డపై, సొంత అభిమానుల కేరింతల మధ్య వన్డే మ్యాచ్‌లు ఆడటం కొత్త ఉత్సాహాన్నిస్తుందన్నాడు.

2009 లో జరిగిన ఐపీఎల్ సీజన్ ఆడటం దక్షిణాఫ్రికా గడ్డపై ఎలా ఆడాలన్న విషయాన్ని తెలియజేసిందన్నాడు. 2009 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభూతి ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంతగానో తోడ్పడిందన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కేసుల భయం... అడక్కుండానే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా!!

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

ఆ మార్గంలో 78 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే!!

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

Show comments