Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాంచైజీలు నన్ను కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరం!

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ కోసం జరిగిన వేలం పాటలో తనను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరమని వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఓపెనర్ క్రిస్ గేల్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ వేలంలో పరిస్థితులు అనుకూలించకపోవడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో నిరాశపరిచిందన్నాడు. మైదానంలో తన శక్తి సామర్థ్యాలేమిటో ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలకు బాగా తెలుసు. కనుక కొత్తగా రుజువుచేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నాడు.

కాగా, గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ గేల్‌వైపు ఈసారి వేలంలో పాల్గొన్న పది ఫ్రాంఛైజ్‌లలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను గమనంలో ఉంచుకునే ఈసారి వేలంలో ఐపిఎల్ ఫ్రాంఛైజ్‌లు తనను విస్మరించాయని భావిస్తున్నట్టు గేల్ చెప్పాడు.

వచ్చే ఏప్రిల్ 8వ తేదీ నుండి మే 22వ తేదీ వరకు జరిగే ఐపిఎల్ నాలుగో ఎడిషన్‌కు గేల్ కేవలం రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతడిని కొనుగోలు చేసేందుకు ఈసారి ఏ ఫ్రాంఛైజ్ ముందుకు రాలేదని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments